వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం ఆర్ఆర్ కాలనీ, చినరావూరు పార్కుల్లో పర్యటించి పనులను పరిశీలించారు. ఆర్ఆర్ కాలనీలో పారిశుద్ధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ ఈ-ఆటోల పనితీరును తనిఖీ చేసి కార్మికులకు సూచనలు చేశారు.
చినరావూరు పార్కులో పచ్చదనం నిర్వహణపై సిబ్బంది, సూపర్వైజర్తో మాట్లాడారు. పార్కును అందంగా, పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Comments
Loading comments...

