Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్డి (బి)లో ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన

Follow Udayam on Google
Naresh Aug 19, 2026 2:50 PM నిర్మల్General
పార్డి (బి)లో ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన - Udayam
కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైద్య సిబ్బంది రక్తపోటు, మధుమేహం, హెచ్‌ఐవీ, మలేరియా, డెంగ్యూ తదితర పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి మందులు అందించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ విజేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...