వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ సుహాస్ ఎల్వై శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 గ్రూప్-ఈ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు జోయ్టు ధర్‌పై 21-8, 21-11తో వరుస గేముల్లో విజయం సాధించాడు.
ఇతర మ్యాచ్‌ల్లో కృష్ణ నాగర్, శివరాజన్ సోలైమలై సింగిల్స్‌లో గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో మనీషా రామ్‌దాస్-ప్రమోద్ భగత్ జోడీ విజయం సాధించగా, మానసి జోషి, రుథిక్ రఘుపతి జోడీ ఓడింది.
Comments
Loading comments...

