వార్తలకు తిరిగి వెళ్లండి

బహుజన ఉద్యమ యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గౌడ సంఘం గుండా చంద్రయ్య గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని మంగళవారం గ్రామంలో గౌడ సంఘం నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస తులసి, గౌడ సంఘ పెద్దలు లక్ష్మణ్ గౌడ్, నారాయణ గౌడ్, మల్లేష్ గౌడ్, సత్య గౌడ్, గురవయ్య గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

