Udayam Digital
Menu

పాక్‌లో బస్సు-గ్యాస్ ట్యాంకర్ ఢీ.. 10 మంది మృతి

Anuroop Nov 20, 2026 8:17 AM అంతర్జాతీయంGeneral
పాకిస్థాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై బస్సు, ఎల్‌పీజీ ట్యాంకర్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది గాయపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే రెండు వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Comments

G
Loading comments...