వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెలలోనే ఓయూ ఎంఈడీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా ఫీజులను స్వీకరించనున్నట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. రెండు, మొదటి సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజును ఈ నెల 17లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫీజు వివరాలు, పరీక్షల టైమ్ టేబుల్ కోసం ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పాత్రికేయ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...