వార్తలకు తిరిగి వెళ్లండి

TSCPSEU పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా ధర్నాకు ఆదివారం బయలుదేరారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ
ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వం నిలిచి అందరికీ OPS కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

