Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ స్కాలర్‌షిప్‌ విద్యార్థినులకు మాత్రమే

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 6:32 PM అల్లూరి General
 ఈ స్కాలర్‌షిప్‌ విద్యార్థినులకు మాత్రమే  - Udayam
అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌కు డిగ్రీ, డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థినులు అన్ని వివరాలతో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం రంపచోడవరంలోని ASDS వారిని సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...