వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఏఐ మార్కెట్లో బలోపేతం కావడమే లక్ష్యంగా ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ తమ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ప్రభ్‌జీత్ సింగ్‌ను నియమించింది. సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. వినియోగదారుల వృద్ధి, భాగస్వామ్యాలు, ప్రభుత్వ నిబంధనల సమన్వయాన్ని పర్యవేక్షిస్తారు.
గతంలో ఉబర్ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఐఐటీ, ఐఐఎమ్ పూర్వ విద్యార్థి అయిన ప్రభ్‌జీత్, ఆసియా పసిఫిక్ ఎండీ కిరణ్ మణికి నివేదిస్తారు.
Comments
Loading comments...

