Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోఎడ్జ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్ లాభాల పంట

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 28, 2026 2:15 PM జాతీయంబిజినెస్
ఇన్ఫోఎడ్జ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్ లాభాల పంట - Udayam
ఏఐ, డీప్‌టెక్‌ రంగాల్లో ముందస్తుగా పెట్టిన పెట్టుబడులు ఇన్ఫోఎడ్జ్‌ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 28 ఏఐ స్టార్టప్‌ల్లో పెట్టిన రూ.614 కోట్ల పెట్టుబడి ప్రస్తుతం రూ.1,268 కోట్లకు చేరింది. కన్జూమర్‌ టెక్నాలజీ రంగంలో పెట్టిన రూ.2,755 కోట్లు ఏకంగా రూ.37,214 కోట్లకు (13.5 రెట్లు) పెరిగాయి. మొత్తంగా 135 అంకురాల్లో పెట్టిన రూ.4,900 కోట్ల పెట్టుబడుల విలువ రూ.41,300 కోట్లకు చేరిందని సంస్థ వ్యవస్థాపకుడు సంజీవ్‌ బిక్‌చందానీ తెలిపారు.

Comments

G
Loading comments...