ఓదెలలో దారి మైసమ్మ ఆలయ ప్రారంభోత్సవం

ఓదెల కేంద్రంలోని వినాయక సాగర్ వద్ద శ్రీ మల్లికార్జున ఆటో యూనియన్ అధ్యక్షుడు చింతల పరశురాం ఆధ్వర్యంలో నిర్మించిన దారి మైసమ్మ ఆలయాన్ని శుక్రవారం సర్పంచ్ కనికిరెడ్డి సతీశ్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాహనదారులకు రక్షణగా, గ్రామానికి కాపలాగా దారి మైసమ్మను భక్తులు కొలుస్తారని ఆయన తెలిపారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట శంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
