వార్తలకు తిరిగి వెళ్లండి
ఓదెల గ్రామంలో మెయిన్ రోడ్డు నుంచి అండర్ బ్రిడ్జి వరకు సైడ్ డ్రైనేజీకి మూడు నెలల క్రితం తీసిన కందకం స్థానికులకు శాపంగా మారింది. పనులు నిలిచిపోవడంతో ఇళ్లకు వెళ్లే దారి లేక చిన్నారులు గుంతల్లో పడుతున్నారు.
మట్టి గుట్టలపై పిచ్చిమొక్కలు పెరిగి, వర్షపు నీటితో దోమలు, దుర్వాసన తీవ్రమయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

