వార్తలకు తిరిగి వెళ్లండి
ఆన్‌లైన్ జూదం కోసం దారుణం

Photo Gallery
ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్‌ల వలయంలో చిక్కుకుని అప్పులపాలైన ఒక 21 ఏళ్ల విద్యార్థి, డబ్బుల కోసం ఓ మహిళను దారుణంగా మోసగించిన షాకింగ్ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. సదరు మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు, ఆమె వద్దనున్న సొమ్మును దోచుకుని, అనంతరం చంపేసే ఉద్దేశంతో బావిలోకి నెట్టేసి తాడును కత్తిరించాడు.
చావు అంచుల వరకు వెళ్లిన ఆ మహిళ సుమారు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడింది. ఎట్టకేలకు స్థానికులు, పోలీసుల సాయంతో ఆమె సురక్షితంగా బయటపడటంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...