వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు తాము రాకుండా ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించిన కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం, వృథాగా పోతున్న గోదావరి జలాలను పరిశీలించింది.
సముద్రం పాలు అవుతున్న నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తక్షణమే ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన తమ పర్యటనలు, పోరాటాలు సాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

