Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యర్థాల తొలగింపులో జాప్యం చేస్తే చర్యలు: ఛైర్మన్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 4:28 PM కృష్ణా జిల్లాGeneral
వ్యర్థాల తొలగింపులో జాప్యం చేస్తే చర్యలు: ఛైర్మన్‌  - Udayam
గుడివాడ డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్‌ తొలగింపులో జాప్యంపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ సింహాద్రి మనోహర్‌, అధికారులతో సమీక్ష నిర్వహించారు. లెగసీ వేస్ట్‌ తొలగించకపోవడంతో రోజువారీ చెత్త డంపింగ్‌లో ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. వెంటనే వ్యర్థాలు తొలగించాలని, జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని పట్టాభిరామ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...