Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో ఉత్సాహంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:44 PM పల్నాడుGeneral
నూజెండ్లలో ఉత్సాహంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ - Udayam
నూజెండ్ల మండలంలో 'హర్ ఘర్ తిరంగా' వేడుకలు మిన్నంటాయి. ఇందులో భాగంగా వరుసగా రెండో రోజు కూడా జాతీయ జెండాల ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సత్యనారాయణతో పాటు ఎంఈవోలు రవిచంద్ర, సత్యనారాయణ, హెచ్‌ఎం శ్రీదేవి నాయకత్వం వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది పెద్దఎత్తున తరలివచ్చి త్రివర్ణ పతాకాలు చేబూని, దేశభక్తి నినాదాలు చేస్తూ పురవీధుల్లో ఊరేగింపుగా సాగారు.

Comments

G
Loading comments...