Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిరలో ఇంటింటికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:52 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మడకశిరలో ఇంటింటికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు - Udayam
మడకశిర 16వ వార్డులోని మారుతి నగర్, సీసీ బండ, నాగన్న కుంట కాలనీల్లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు కాపు రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌ నగదును అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడిన కాపు రామాంజనేయులు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్‌ అందుతున్నదా లేదా అని ఆరా తీశారు.

Comments

G
Loading comments...