వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండల కేంద్రంలోని మిస్కిన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న నిజామాబాద్ వెళ్లి సోమవారం తిరిగి వచ్చి చూడగా, ఇంట్లోని వస్తువులు చిందరవదరగా పడి ఉన్నాయి.
బీరువాలో భద్రపరిచిన రూ. 40 వేల నగదు, తులం బంగారం (నారా గల్సర్) తో పాటు కొంత వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

