వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ సాంకేతిక యాజమాన్యం సహకారంతో నర్మేట రైతువేదికలో ఎంఏవో మమత ఆధ్వర్యంలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్‌పీఎల్) శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్, ఏడీఏ వసంత సుగుణ రైతులకు సూచనలు చేశారు.
భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వరి, పత్తి పంటల్లో ఎరువులను సమతుల్యంగా వినియోగించే విధానాన్ని వివరించారు. వివిధ గ్రామాల సర్పంచులు, ఏటీఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

