వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 ఉప విద్యాధికారులు/గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. 18 నుండి 44 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) స్పష్టం చేసింది.
ఈ పోస్టులకు ఈ నెల 12వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలు, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

