వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్‌మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు చేసేటప్పుడు జనసేన శ్రేణులు పార్టీ మార్గదర్శకాలు పాటించాలని పవన్ కల్యాణ్ సూచించారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని స్పష్టం చేశారు.
రాజకీయ ప్రత్యర్థుల సోషల్‌మీడియా ప్రచార వలలో పడొద్దని హెచ్చరించారు. పార్టీ అంతర్గత విషయాలపై ఇష్టానుసారం మాట్లాడకుండా, కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

