వార్తలకు తిరిగి వెళ్లండి

వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారులకు శుభవార్త. ఇకపై వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లోకి ఓటీపీ లేదా పాస్‌వర్డ్ అవసరం లేకుండానే సులభంగా లాగిన్ కావచ్చు. ఇందుకోసం ‘సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్’ అనే కొత్త సాంకేతికతను సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
ఈ నెట్‌వర్క్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే మొబైల్ నంబర్‌ను ధ్రువీకరిస్తాయి. ఇది అకౌంట్ రికవరీ, సెక్యూరిటీ చెక్స్ సమయంలో మరింత సురక్షితంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

