Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ అరెస్టు కేసుల్లో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 29, 2026 11:26 AM అల్ ఇండియా జాతీయ
డిజిటల్ అరెస్టు కేసుల్లో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు - Udayam Digital
డిజిటల్ అరెస్టు కేసులు బందిపోటు దోపిడీతో సమానమైన తీవ్రమైన నేరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్ల కష్టార్జితాన్ని హరించే ఈ కేసుల్లో అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని తెలిపింది. ట్రయల్, హైకోర్టులకు ఈ మేరకు స్పష్టతనిచ్చిన ధర్మాసనం, ఇవి వ్యవస్థీకృత నేరాల కిందకు వస్తాయని పేర్కొంది. ఖాతా తెరవడంలోనే సహకరించానంటూ బెయిల్ కోరిన వ్యక్తి అభ్యర్థనను తోసిపుచ్చింది.

Comments

G
Loading comments...