వార్తలకు తిరిగి వెళ్లండి

రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లోని సర్వే నంబర్లను ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ నిరసనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ధర్నా చేపట్టారు. భూముల నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు.
Comments
Loading comments...

