వార్తలకు తిరిగి వెళ్లండి

హత్నూర మండలం దౌల్తాబాద్ (కాసాల)లో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలపై నిరసన తెలిపారు.
కరెంట్ సక్రమంగా రాక మోటార్లు కాలిపోతూ, పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

