Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పాలిటెక్నిక్ కాలేజీకి బస్సు సౌకర్యం కల్పించాలి - ABVP

Follow Udayam on Google
md jabeer Aug 14, 2026 5:59 PM నిర్మల్General
నిర్మల్ పాలిటెక్నిక్ కాలేజీకి బస్సు సౌకర్యం కల్పించాలి - ABVP - Udayam
నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ABVP ఆధ్వర్యంలో బస్ డిపో మేనేజర్‌ వెంకట రమణకు వినతి పత్రం అందజేశారు. ఉదయం కాలేజీకి వెళ్లడానికి, సాయంత్రం తిరిగి రావడానికి బస్సులు సరిగ్గా లేవని, జగిత్యాల, ఖానాపూర్ బస్సులు కాలేజీ దగ్గర ఆపడం లేదని ప్రెసిడెంట్ పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీషా, లితిక, అజయ్, కృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...