Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 6:23 PM నిర్మల్ General
నిర్మల్ లో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నవీన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం పొందారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...