Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ లో ప్రైవేటు టీచర్ల భారీ ర్యాలీ

Follow Udayam on Google
సందీప్ Aug 21, 2026 12:32 PM నిర్మల్General
నిర్మల్‌ లో ప్రైవేటు టీచర్ల భారీ ర్యాలీ - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...