Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ లో కోతుల బీభత్సం.. ఒకరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
నిర్మల్ Sep 12, 2026 4:10 PM నిర్మల్General
నిర్మల్‌ లో కోతుల బీభత్సం.. ఒకరికి తీవ్ర గాయాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో కోతులు శనివారం బీభత్సం సృష్టించాయి. కాలనీలోని గంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇంట్లోకి చొరబడిన కోతులు ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తూ హల్‌చల్‌ చేశాయి. గంగారెడ్డిపై దాడి చేయడంతో ఆయన రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కోతుల దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Comments

G
Loading comments...