Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఆర్టీసీ డిపోలో ఈనెల 9న కార్గో వస్తువుల వేలం

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:35 AM నిర్మల్ General
నిర్మల్ ఆర్టీసీ డిపోలో ఈనెల 9న కార్గో వస్తువుల వేలం - Udayam
ఆర్టీసీ నిర్మల్ డిపో కార్గో విభాగంలో చాలా కాలంగా నిల్వ ఉండి, సంబంధిత యజమానులు తీసుకెళ్లని పాత కార్గో వస్తువులను ఈ నెల 9న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి మంగళవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేలం జూలై 9న ఉదయం 11 గంటలకు నిర్మల్ ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించబడుతుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు, ఆసక్తి గల కొనుగోలుదారులు నిర్ణీత సమయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...