వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా ప్రముఖ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. పూర్వ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప సేవా కాలం ముగియడంతో, ఆయన స్థానంలో రాహుల్ దేవరాజ్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత పదేళ్లుగా నిమ్స్ యూరాలజీ విభాగాధిపతిగా ఉన్న ఈయనకు సుదీర్ఘ వైద్య అనుభవం ఉంది. దేశంలోనే రికార్డు స్థాయిలో వేలాది కిడ్నీ మార్పిడి, రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఘనత డాక్టర్ రాహుల్‌కు దక్కింది.
Comments
Loading comments...

