Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టులో 12.203 టీఎంసీల నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:51 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టులో 12.203 టీఎంసీల నిల్వ - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో గురువారం ఉదయం నీటిమట్టం 1400.77 అడుగులకు చేరినట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.203 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...