వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
కిరాణా సామగ్రి తీసుకెళ్లే సమయంలో కోతులు వెంబడిస్తున్నాయని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయని, అధికారులు స్పందించి సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

