Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బంగారుతీగ’ చేపల మరణాలకు కారణం ఏంటి?

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:22 AM హైదరాబాద్General
‘బంగారుతీగ’ చేపల మరణాలకు కారణం ఏంటి? - Udayam
గౌతమి-గోదావరి నది ముఖద్వారం వద్ద వేల సంఖ్యలో ‘బంగారుతీగ’ (ఇండియన్‌ మేకెరెల్‌) చేపలు చనిపోవడానికి నీటిలో ఉప్పుశాతం పడిపోవడమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అధ్యయనంలో వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన మంచినీటి వల్ల ఉప్పుదనం తగ్గి, పీహెచ్‌ స్థాయిల ప్రభావంతో అమ్మోనియా విషపూరితంగా మారి చేపల మొప్పలు దెబ్బతినడంతోనే ఈ మరణాలు సంభవించినట్లు ఇన్‌కాయిస్‌, ఎస్‌ఐఎఫ్‌టీ నిపుణులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...