వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

HYD: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మధు యాష్కీ గౌడ్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పరీక్షలో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

