Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధుల కొరతతో నిలిచిపోయిన భవన నిర్మాణం

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:40 AM కామరెడ్డిGeneral
నిధుల కొరతతో నిలిచిపోయిన భవన నిర్మాణం - Udayam
బిక్కనూర్ మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. గత ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేయడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే మంజూరైన నిధులు సరిపోక నిర్మాణం పూర్తికాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అదనపు నిధులు మంజూరు కాకపోవడంతో భవనం అసంపూర్తిగా మిగిలింది. ప్రభుత్వం స్పందించి అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...