వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని వినాయక నగర్‌లో మంగమ్మ (70) దారుణ హత్యకు గురయ్యారు. పాడుబడిన ఇళ్ల మధ్య ఆమె మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు.
ముఖం, తలపై తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. చెవి దిద్దులు, ఉంగరం, బంగారు గొలుసు కనిపించకపోవడంతో నగల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడు బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

