వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వ రీ సర్వే తప్పుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే కూటమి ప్రభుత్వం జిల్లాల్లో ప్రత్యేకంగా 'రెవెన్యూ క్లినిక్'లను ఏర్పాటు చేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం బల్లంకిలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఆమె రైతులకు పంపిణీ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందకపోతే, ప్రజలు తమ చరవాణి (మొబైల్) ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు త్వరలోనే ఒక నూతన వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో నిబద్ధతతో సేవ అందిస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

