వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ మోసాల నుండి యూజర్ల రక్షణ కోసం వాట్సాప్ కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీనిలోని 'సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్' ద్వారా తెలియని నంబర్ల స్కామ్ కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అవుతాయి. అలాగే అపరిచిత నంబర్ల మెసేజ్‌ల కోసం 'కాంటెక్స్ట్ కార్డ్స్' ద్వారా అదనపు సమాచారం లభిస్తుంది.
వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్ చేస్తే ఓటీపీల దొంగతనాన్ని అడ్డుకోవడానికి ఈ ఫీచర్ ముందే హెచ్చరిస్తుంది. ఖాతా వేరే డివైజ్‌కు లింక్ అయినా వెంటనే అలర్ట్ వస్తుంది. ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ పిన్ ద్వారా వాట్సాప్ ఖాతాకు మరింత గట్టి భద్రత లభిస్తుంది.
Comments
Loading comments...

