Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వైద్యరంగంలో సరికొత్త విప్లవం

అనురూప్ గౌడ్ Jul 17, 2026 2:14 PM హైదరాబాద్about 2 hours ago
తెలంగాణ వైద్యరంగంలో సరికొత్త విప్లవం - Udayam Digital
రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేస్తూ 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునీకరిస్తూ రామగుండం, శంషాబాద్‌లలో వంద పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. విదేశాల్లో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...