వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల భద్రతపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బస్సులకు పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని స్పష్టం చేస్తూ, సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించరాదని ఆదేశించింది.
బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
Comments
Loading comments...

