Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త జీటీ 650 ధర రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 9:05 PM బిజినెస్బిజినెస్
కొత్త జీటీ 650 ధర రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు - Udayam
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ భారత మార్కెట్లో 2026 కాంటినెంటల్‌ జీటీ 650ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల వరకు ఉంది. కొత్త బైక్‌ నాలుగు రంగుల్లో లభించనుంది. మెకానికల్‌ ప్యాకేజీలో మార్పులు చేయలేదు. 648 సీసీ ఇంజిన్‌ 47 హార్స్‌పవర్‌, 52.3 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Comments

G
Loading comments...