Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరికొత్త బైకులను విడుదల చేసిన యెజ్డీ: రూ.1.99 లక్షల నుంచి ప్రారంభం

Follow Udayam on Google
Arunima Singh Jun 09, 2026 4:27 PM జాతీయంబిజినెస్
సరికొత్త బైకులను విడుదల చేసిన యెజ్డీ: రూ.1.99 లక్షల నుంచి ప్రారంభం - Udayam
ప్రీమియం బైకుల తయారీ సంస్థ యెజ్డీ దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. 'స్క్రాంబ్లర్ 350' మోడల్ ధరను రూ.1,99,950గా నిర్ణయించగా, శక్తివంతమైన 'స్క్రాంబ్లర్ 650' మోడల్ ధరను రూ.3,24,950గా నిర్ధారించినట్లు కంపెనీ ప్రకటించింది. స్పోర్ట్స్ బైకులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వీటిని తెచ్చామని క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్ అనుపమ్ థారేజా తెలిపారు. ఈ నయా మోడళ్లపై నాలుగేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నట్లు, దీనిని ఆరేళ్ల వరకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...