వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో గురువారం నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు CID ASP ఎస్. శిరీష తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు.
డిపాజిటర్లు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫొటో, మొబైల్ నంబర్ తదితర పత్రాలను తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

