వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండల కేంద్రంలో కొంతకాలంగా పశు వైద్యాధికారి లేక మూగజీవాలకు వైద్య సేవలు అందకుండా పోతోంది. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో చికిత్స అందక సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన జలుమూరు పశువైద్య కేంద్రంలో వైద్యాధికారిని నియమించాలని కోరారు. నెలలుగా సమస్య ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

