వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన ముత్తవల్లిని ఇప్పటికే తొలగించామని ఆయన పేర్కొన్నారు.
బాధ్యతలను విస్మరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దర్గాపై పూర్తి నిఘా ఉంచామని, విచారణ అనంతరం తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

