Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీ గుట్టురట్టు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 16, 2026 11:35 AM జాతీయంGeneral
నీట్ లీకేజీ గుట్టురట్టు - Udayam
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. లాతూర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రఘునాథ్, ఎన్టీఏ ప్యానెలిస్ట్ కులకర్ణికి ఐదు లక్షలు చెల్లించి కెమిస్ట్రీ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు నిరూపించింది. నిందితుడి మొబైల్‌లో లభించిన 132 ప్రశ్నల్లో ఏకంగా 111 ప్రశ్నలు అసలు పరీక్షా పత్రంతో హూబహూ సరిపోలాయని ఢిల్లీ న్యాయస్థానానికి సీబీఐ నివేదించింది. ఈ లీకేజీ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...