వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నేలకొండపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం మండల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో ఎర్రయ్యకు వినతిపత్రం సమర్పించారు.
ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్ధానాలను తక్షణమే నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

