Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో వరుణ యాగం

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 9:04 AM విజయనగరంGeneral
నేడు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో వరుణ యాగం - Udayam
బొబ్బిలిలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు యాగం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉదయం 6.57 గంటలకు యాగం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...