Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:37 PM శ్రీకాకుళంGeneral
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక - Udayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగావళి, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డు కోత, కరకట్టలకు నష్టం వంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...